X
होम टॉप-लिस्ट

అమితాబ్ బ‌చ్చ‌న్‌ నుంచి క‌మ‌ల్ హాస‌న్‌ వరకు మారుతున్న స్టార్స్ అప్పియ‌రెన్స్‌

Author Administrator | Published: Tuesday, July 25, 2023, 08:39 AM [IST]

సినిమా ట్రెండ్ మారింది. ఓటీటీల హ‌వా పెరిగిన త‌ర్వాత కొత్త ద‌ర్శ‌కులు, కొత్త క‌థ‌లు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి అంచ‌నాలు లేని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల‌ను సాధిస్తుండ‌టంతో మ‌న స్టార్ హీరోలు సైతం కొత్త ద‌ర్శ‌కులు, కంటెంట్ వైపు చూస్తున్నారు. పాత్ర నిడివితో సంబంధం లేకుండా న‌టించ‌టానికి, మ‌రో స్టార్ హీరో సినిమాలో సంద‌ర్భానుసారం గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌టానికి అస్స‌లు ఆలోచించ‌టం లేదు. ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాల్లో గెస్ట్ అప్పియ‌రెన్స్ లేదా కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌బోతున్న మ‌న హీరోలెవ‌రో చూద్దాం..


cover image

Table of content

అమితాబ్ బచ్చాన్

బాలీవుడ్‌కి చెందిన ఈ సీనియ‌ర్ స్టార్ ఒక‌ప్పుడు హిందీ సినిమాల‌కే ప‌రిమితం అయ్యారు. అయితే ఎప్పుడైతే బాహుబ‌లి ,ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్‌ను దాటి పాన్ వ‌రల్డ్‌కు చేరుకున్నాయో అమితాబ్ వంటి యాక్ట‌ర్ టాలీవుడ్ మూవీస్ చేయ‌టానికి ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇంత‌కు ముందు ఆయ‌న చిరంజీవి హీరోగా రూపొందిన `సైరా న‌ర‌సింహారెడ్డి`లో కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తోన్న `క‌ల్కి 2898 AD`లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

రజనీకాంత్

సూప‌ర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో బాలీవుడ్ సినిమాల్లో ఇత‌ర హీరోల‌తో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత ఆయ‌న స్టార్ డ‌మ్ పీక్స్‌కి చేర‌టంతో మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ చేసే అవ‌కాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడాయ‌న త‌న ఇమేజ్‌ను దాటి `లాల్ స‌లాం` సినిమాలో మొయిద్దీన్ అనే కీల‌క పాత్ర‌లో మెప్పించ‌బోతున్నారు. త‌న పాత్ర‌కు సంబంధించిన లుక్ కూడా రివీల్ అయ్యింది. అయితే ఈ పాత్ర అభిమానుల‌ను ఎంత సేపు మెప్పిస్తుంద‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. 

విజయ్ (తమిళ యాక్టర్)

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన ద‌ళ‌ప‌తి విజ‌య్.. కెరీర్ స్టార్టింగ్‌లో సూర్యతో క‌లిసి సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత త‌న స్టార్ డ‌మ్ మారింది. మాస్ ఇమేజ్ వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న మ‌ల్టీస్టారర్స్ చేయ‌లేదు. అయితే చాలా ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు షారూఖ్ ఖాన్ మూవీ జ‌వాన్‌లో విజ‌య్ క‌నిపించ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ విజ‌య్ అలాగే ఈ సినిమాలో న‌టిస్తే మాత్రం సినిమాకు అడ్వాంటేజ్‌గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.

కమల్ హాసన్

ఇండియ‌న్ సినిమాలో బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా పేరున్న క‌మ‌ల్ హాస‌న్ ఎన్ని ప్రయోగాత్మ‌క పాత్ర‌లు చేయాలో వాట‌న్నింటినీ చేశారు.. చేస్తున్నారు. ఇప్పుడు ప్ర‌భాస్‌ `క‌ల్కి 2898 AD`లో విల‌న్‌గా న‌టిస్తుండ‌టం ఆయ‌న ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. హీరో పాత్ర‌కు ధీటుగా విల‌న్ పాత్ర‌కు ప్రాధాన్యం ఉండ‌టం వ‌ల్ల‌నే తాను `క‌ల్కి 2898 AD`లో న‌టించాన‌ని క‌మ‌ల్ స్వ‌యంగా చెప్పారు. అయితే ఆయ‌న పాత్ర రేంజ్ ఎలా ఉంటుంది.. ఎంత సేపు ఉంటుంద‌నేది తెలియాలంటే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు ఆగాల్సిందే. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+